ఇటీవలే జగన్మోహన్ రెడ్డి సర్కార్ రైతులందరికీ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. రైతులందరికీ చేయూత అందించే విధంగా ఓ మహత్తర పథకాన్ని ప్రారంభించింది జగన్ సర్కార్. వైయస్సార్ జల కళ అనే పథకాన్ని ప్రారంభించి రైతులకు ఉచితంగా బోర్లు వేయించేందుకు నిర్ణయించింది. ఇటీవలే ఈ పథకాన్ని ప్రారంభించిన జగన్ సర్కార్ రైతులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ సూచించింది. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
అయితే ఇప్పటికి కూడా వైయస్సార్ జలకళ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. ఆన్లైన్లో నేరుగా గ్రామ పంచాయతీ సచివాలయం లోకి వెళ్లి వైయస్సార్ జలకళ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. లేదా ఆధార్ కార్డు వివరాలతో … http://ysrjalakala.Ap.gov.in అనే ప్రభుత్వం వెబ్సైట్లోకి వెళ్లి రైతులు వైయస్సార్ జలకళ పథకానికి దరఖాస్తు చేసుకొని బోర్లు పొందేందుకు అవకాశం కల్పించింది.