తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండదని సమాచారం. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత రాసిన లేఖతో అధిష్టానం మరోసారి పునరాలోచనలో పడినట్లు సమాచారం.
అనవసరపు పేర్లతో పార్టీకి ఇబ్బందులు ఎందుకని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నట్టు ఢిల్లీ వర్గాలు రాష్ట్రంలోని పెద్దలకు లీకులు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ ఓ సీనియర్ నేత చక్రం తిప్పినట్లు తెలిసింది.
దీంతో సీఎం రేవంత్ నిర్ణయాలకు తాత్కాలిక బ్రేక్ పడినట్లు అయ్యింది. ప్రస్తుతం పార్టీలో మంత్రివర్గ విస్తరణపై వచ్చిన అపొహలు, భిన్నాభిప్రాయాలు పోయేదాక వేచి చూసే ధోరణిలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.