బ్రేకింగ్:ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర చేధించిన అధికారులు…!

-

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు చేధించారు. ఇస్లామిక్ స్టేట్ కి చెందిన ఉగ్రవాది ని అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులు రిమాండ్ కి తరలించారు. రిడ్జ్ రోడ్ ప్రాంతంలోని బుద్ధ జయంతి పార్క్ సమీపంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) కమాండోలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్కడ ఉగ్రవాదులు తిరుగుతున్నారు అనే సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేసారు.

ఢిల్లీలో పలు ప్రాంతాల్లో రెక్కీలు కూడా నిర్వహించారని అధికారులు చెప్తున్నారు. వారి వద్ద నుంచి 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ ఆపరేటర్‌ను ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ (ఐఇడి) ను అరెస్ట్ చేసామని ఢిల్లీ అధికారులు వెల్లడించారు. తాము భారీ కుట్రను ఈ అరెస్ట్ ద్వారా చేదించినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version