ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ అంశం అప్పట్లో ఒక ఊపు ఊపింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అప్పట్లో ఈ ఉద్యమాన్ని కాస్త స్పీడ్ గా ముందుకు నడిపించారు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఇక ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ తో సహా తుని రైలు దహనం ఘటనలో నిందితులకు షాక్ తగిలింది. మార్చి 3న విజయవాడ రైల్వే కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి.
ముద్రగడ తో సహా సమన్లు జారీ అయిన వారిలో మంచాల సాయి సుధాకర్ నాయుడు..మరికొందరు నిందితులు ఉన్నారు. 2016 జనవరి 31 న తుని వద్ద రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం చేయగా జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్లో రైల్వే చట్టం సెక్షన్ 146,147,153,174 కింద ముద్రగడ తో సహా పలువురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు.