బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్తె బాంబు దాడి జరిగింది.సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది.నలంద నితీష్ నిర్వహిస్తున్న జనసభ లో పేలుడు జరిగింది.సీఎంకు కూర్చున్న స్టేజ్ దగ్గర అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిగింది.పేలుడు తర్వాత స్టేజి పై ఉన్న వాళ్ళు పరుగులుపెట్టారు.ఈ ఘటనలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తృటిలో తప్పించుకున్నారు. ఓవ్యక్తి బాంబు విసిరినట్లు గా సమాచారం.నితీష్ సభకు 15 నుంచి 18 అడుగుల దూరంలో పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.తక్కువ తీవ్రత గల బాంబు కావడంతో ప్రమాదం తప్పింది అన్నారు పోలీసులు. కాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పై వరుస దాడి ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే పాట్నా సాహిబ్ దగ్గర కూడా నితీష్ పై దాడి జరిగింది.వెనక నుంచి వచ్చిన వ్యక్తి నితీష్ పై దాడికిికి పాల్పడ్డాడు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.