తిరుపతి నగర వనంలో చెట్ల నరికివేతపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దివ్యారామంలో జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్లు నరికేసినట్టు ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం స్పందించింది. దివ్యారామంలో చెట్లు నరికివేత సమయంలో నిబంధలు ఉల్లంఘన జరిగినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఈ ఘటన పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెట్ల నరికివేత పై చాలా సీరియస్ అయ్యారు. కంచె ధ్వంసం అవ్వడంతో వన్యప్రాణాలు నీరు, తిండి కోసం బయటకు వస్తూ ప్రాణపాయ స్థితిలోకి వెళ్తున్నాయని సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం పై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలని సూచించారు పవన్. ఈ తరుణంలోనే పూర్తి స్థాయి విచారణకు అటవీ శాఖ ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా పీసీసీఎఫ్ పి.వి. చలపతి రావును నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.