పార్లమెంట్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్ల కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంటులో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపధ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం అన్ని పార్టీల అత్యవసర వ్యాపార సలహా కమిటీ (బిఎసి) సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఈ సమావేశాలను తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
అందరు ఎంపీలు కూడా ఈ సమావేశాలను తగ్గించడానికి అంగీకరించారు అని స్పీకర్ పేర్కొన్నారు. అయితే, ఇది ఎప్పుడు, ఎన్ని రోజులు తగ్గించాలో స్పీకర్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. 30 మంది ఎంపీలు ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ గా తేలారు. వైసీపీకి చెందిన ఒక ఎంపీ కూడా కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. బిజెపి ఎంపీలు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు.