అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కీలక విషయం బయటపడింది. వైట్ హౌస్ కు ఒక కవర్ వచ్చిందని దాని పేరు రిసిన్ అనే విష పదార్ధం , దానికి విరుగుడు లేదు అని అమెరికా మీడియా పేర్కొంది. కెనడా నుండి వచ్చినట్లు భావిస్తున్న కవరు వైట్ హౌస్ వద్దకు రాకముందే ప్రభుత్వ మెయిల్ సెంటర్‌లో అడ్డగించబడిందని న్యూయార్క్ టైమ్స్, సిఎన్ఎన్ మరియు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాలు రాసాయి.
వీటి గురించి అమెరికా ఎఫ్బిఐ ని ప్రశ్నించగా “యుఎస్ సీక్రెట్ సర్వీస్ మరియు యుఎస్ పోస్టల్ ఇన్స్పెక్షన్ సర్వీస్ సంయుక్తంగా యుఎస్ ప్రభుత్వ మెయిల్ వద్ద దొరికిన అనుమానాస్పద లేఖపై దర్యాప్తు చేస్తున్నారు. దీని వలన ప్రజల భద్రతకు ఎటువంటి ముప్పు లేదు” అని ఎఫ్బిఐ తెలిపింది. వైట్ హౌస్ మరియు యుఎస్ సీక్రెట్ సర్వీస్ దీనిపై స్పందించడానికి నిరాకరించాయి.