అమెరికాలో లాక్ డౌన్ ని ఎత్తివేయ్యాలి అంటూ అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్థను రక్షించుకోవాలి అంటే లాక్ డౌన్ ని ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతు దారులు హన్ టింగ్ టన్ బీచ్ లో వందలాది మంది నిరసన కారులు అనదోలన చేస్తున్నారు. ఒక వైపు అమెరికాలో 7 లక్షలకు దాటాయి కరోనా కేసులు. దీనిపై ఆందోళన వ్యక్తమవుతున్నా సరే లాక్ డౌన్ వద్దని అంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఆందోళనలకు మద్దతు ఇవ్వడం విశేషం. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలపై ఆయన ట్వీట్ చేసారు. ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఆంక్షలు ఎత్తివేయడ౦ మంచిది అని ఆయన ట్వీట్ చేసారు. ట్రంప్ 2020 పేరుతో ఫ్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. మిన్నెసోటా మిచిగాన్, వర్జీనియా, నార్త్ కరోలినా, కెంటకి రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలకు ఆయన మద్దతు ఇచ్చారు.
ఈ రాష్ట్రాలు అన్నీ కూడా డెమోక్రటిక్ గవర్నర్ల పాలనలో ఉన్నాయి. ఆంక్షలు ఎత్తివేయాలి అనే ఆలోచనలను ముందు నుంచి తప్పు పడుతున్నారు. ఇక అక్కడ ఒక్క రోజే 4500 మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కేసులు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం ఈ విధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది.