Telangana: 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ను TSPSC విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
కాగా…గతంలో లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయము అందరికీ తెలిసిందే. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.కొత్తగా 60 పోస్టులను కలిపి 563 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.