BREAKING: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మంచు విష్ణు

-

టాలీవుడ్ యువ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపైన, తన కుటుంబ సభ్యుల పైన జరుగుతున్న ట్రోలింగ్ పై మంచు విష్ణు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. టాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర హీరో ఆఫీస్ నుంచి తనపై ట్రోల్ చేస్తున్నారని, తన కుటుంబం పై పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలాగే 18 యూట్యూబ్ ఛానల్ లపై కేసులు పెడుతున్నామని తెలిపారు మంచు విష్ణు. వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి తనపై ట్రోలింగ్ చేస్తున్నారని.. సాధారణంగా తాను ఆ ట్రోల్స్ పట్టించుకోను కానీ.. జవాబుదారీతనం కోసమే కేసరి పెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇటీవల “జిన్నా” చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా ఇన్ ఫ్యూలెంసర్స్ తో మంచు విష్ణు మాట్లాడారు. అప్పుడు కూడా ఇదే విషయంపై ఆయన ప్రస్తావించారు.

జూబ్లీహిల్స్ లోని ఓ ఐటీ కంపెనీలో తన కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలు సేకరించానని తెలిపిన మంచి విష్ణు.. తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version