మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. గుంటూరు నుంచి భారీ ర్యాలీగా జనసేన కార్యాలయానికి వచ్చారు.ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.ఎంపీతో పాటు ఆయన తనయుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాగబాబు,నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
ఇటీవల బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బాలశౌరి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాలశౌరి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. రాజకీయ పార్టీల కంటే అభివృద్ధి ముఖ్యమని.. ఐదేళ్లుగా అభివృద్ధి జరిగిందేమీ లేదని ఆరోపించారు.