బ్రేకింగ్ : తెలంగాణ సీఎం కార్యాలయానికి కరోనా..! 15 మందికి పాజిటివ్..!

-

15 officials tested positive at cm kcr camp office
15 officials tested positive at cm kcr camp office

కారోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో వీర విహంగం చేస్తుంది. ఎవ్వరినీ వదలడం లేదు.. రాజకీయ సినీ క్రీడా వర్గాలు ఎవ్వరూ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీని బారిన పడక తప్పడం లేదు. కరోనా పయనానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ మహమ్మారి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యలయం క్యాంప్ ఆఫీసు వరకు చేరిపోయింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న 15 మంది పోలీసులకి కరోనా సోకింది. సోకిన వారిలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు, నగర పోలీసులు ఉన్నారు. బాధితులంతా కార్యాలయానికి బయట సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం అందరికీ టెస్టులు నిర్వహిస్తున్న నేపద్యంలో 15 మంది పోలీసులకి కరోనా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ వారు ఎవరెవరిని కలిశారో అనే వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. అనంతరం వారందరినీ క్వారంటైన్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే నేపద్యంలో యూసుఫ్‌గూడ ఫస్ట్‌ బెటాలియన్‌లో మరో 11 మందికి కరోనా సోకింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version