తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం మరోసారి బయటపడింది. ఫీజు చెల్లించినా విద్యార్థులకు హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు జారీ చేయలేదని తెలుస్తోంది.విషయం బయటకు రాకుండా ఉండేందుకు హాల్ టికెట్స్ లేకున్నా విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారీ తీసింది.
అయితే, సీజీజీలో సాంకేతిక సమస్య కారణంగా హాల్ టికెట్లు జనరేట్ కాలేదని అధికారులు చెబుతున్నారు.ఇక విద్యార్థులంతా పరీక్షకు హాజరయ్యేలా చూడాలంటూ అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఇదిలాఉండగా, ఇంటర్ బోర్డు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు హమీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటోందని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.