ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా దేశం వూహాన్ నగరం. ఈ ప్రాంతం నుండి పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచంలో 5 లక్షల మందిని బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మొదటిగా వచ్చిన వూహాన్ నగరంలో ఈ వైరస్ చాలా మందిని బలితీసుకుంది. దీంతో పరిస్థితి అదుపు చేయలేక చైనా ప్రభుత్వం వూహాన్ నగరంలో లాక్ డౌన్ ప్రకటించడంతో..చాలా రోజుల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ప్రపంచంలో ఆయా దేశాలలో పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్న తరుణంలో మొన్నటి వరకు వూహాన్ నగరంలో పరిస్థితి అదుపులో ఉండగా…తాజాగా మరొకసారి ఈ నగరం నుంచి మరొక బ్రేకింగ్ న్యూస్ వినబడుతోంది. తాజాగా మళ్లీ ఈ నగరం లో వైరస్ గట్టిగా వ్యాపిస్తుందని చైనా చెబుతోంది. ఉన్న కొద్ది కేసులు మళ్లీ మొదటి దశలో నమోదైనట్లు ప్రస్తుతం వూహాన్ నగరంలో నమోదవుతున్నాయని చైనా నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దీనికంతటికీ కారణం ఇటీవల వూహాన్ నగరంలో లాక్ డౌన్ తీసేశారు, అందుకే ఇలా అయ్యింది అని కొంతమందిఅంటున్నారు.