తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు ఇటీవలే పూర్తీ అయ్యాయి.వాటి రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఈ నెల 25న విడుదల చేసేందుకు ఇంటర్‌బోర్డు కసరత్తు చేస్తోంది.పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 8 నుంచి జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు.
ఫలితాలను జూన్ 20లోపు వెల్లడిస్తామని నెల రోజుల క్రితమే ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్‌వేర్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 25న ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. ఒకరోజు తేడాతో ఫలితాలను 26 న విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. అందుకు కారణం కంప్యూటర్ లో మార్కులు ఎక్కించె సమయంలో తప్పులు దొర్లినట్లు వివరించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ సమస్యను పూర్తీ చేసి ఈ నెల 26 న ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు.