బ్రేకింగ్ : ఎకరాకు రూ. 10 వేలు పంట నష్టం… చెక్కులు పంపిణీకి డేట్ ఫిక్స్ !

-

రెండు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాల వలన ఎక్కువగా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి ఈ వర్షాలు యముడిలా రావడంతో కొంత పంట నెలతల్లికే అంకితం అయిపోగా, మరికొంత పంట మాత్రమే చేతికి వచ్చినా రంగు మారిపోయి , తడిసిపోయి నిరుపయోగంగా మారింది. అయితే ఇలా వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా కేసీఆర్ స్వయంగా గత నెల 23 వ తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించి పరిస్థితులను కళ్లారా చూసి పరిహారాన్ని నిర్ణయించారు . ఆ విధంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వడానికి నిర్ణయించింది.

అంతే కాకుండా ఈ పంట నష్ట పరిహారం కు సంబంధించిన చెక్కులను ఈ నెల 12 వ తేదీన ఇవ్వాలని ప్రకటన చేసింది. దీనితో రైతు కళ్ళల్లో కొంతమేర సంతోషం కనబడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఈ నష్ట పరిహరానికి అప్లై చేసుకోకుండా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version