సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టే సమయంలో కొందరు కనీసం విజ్ఞత కూడా లేకుండా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా వరకు కూడా సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగానే ఉంది. కేసులు పెడుతున్నా ఏ విధంగా కూడా మార్పు రావడం లేదు. తాజాగా ఒక యువకుడు టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ పై అసభ్య పోస్ట్ లు పెట్టాడు. ఈ వ్యవహారం సచిన్ వద్దకు వెళ్ళింది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల యువకుడు క్రికెటర్ సచిన్ కుటుంభం పై అసభ్య పోస్టులు పెట్టాడు. ఇది చూసిన సచిన్ ముంబై పోలీసులు క్రి ఫిర్యాదు చేసాడు. ఐపి అడ్రస్ ఆధారంగా పిడుగురాళ్ల వచ్చి యువకిడిని ఆరెస్టు చేసారు ముంబై పోలీసులు. అక్కడి నుంచి ముంబై తీసుకుని వెళ్ళారు. ఈ వ్యవహారం పట్టణంలో హాట్ టాపిక్ అయింది. ఏది ఎలా ఉన్నా సచిన్ స్పందించడం మాత్రం ఆసక్తికరంగా ఉంది.