వైభవోపేతంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం

-

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకం ఘనంగా జరిగింది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబికులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక సందడిగా చేశారు . ఈ కార్యక్రమంలో ఛార్లెస్‌తోపాటు ఆయన భార్య రాణి కెమిల్లాకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేశారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు లండన్‌కు చేరుకున్నారు. భారతదేశం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ ధన్‌ఖడ్‌ శుక్రవారం లండన్‌కు చేరుకోగా, వారికి ఘన స్వాగతం లభించింది.

ఈ వేడుకలో బ్రిటన్ రాజుగా చార్లెస్-3కి కిరీట ధారణ చేశారు. ఆయన అర్ధాంగి కెమిల్లా పార్కర్ కూడా రాణిగా కిరీటం ధరించారు. అనేక కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు ఈ పట్టాభిషేకానికి హాజరయ్యారు. 2 వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మొదట… చార్లెస్, కెమిల్లా పార్కర్ దంపతులు బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబేకు పయనమయ్యారు. అశ్వ దళాలు, సాయుధ గార్డులు ముందు నడవగా రాజ దంపతులు వెస్ట్ మినిస్టర్ అబేకు చేరుకున్నారు. కాంటర్ బరీ ఆర్చ్ బిషప్ కింగ్ చార్లెస్ ను అందరికీ పరిచయం చేశారు… ఆపై కిరీట ధారణ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version