విధి: ఒకచోట తప్పించుకున్నా మరో చోట బలి

-

బ్రిటన్ కు చెందిన మాథ్యూ లిన్సే తన కొడుకు 19 ఏళ్ల డేనియల్, కూతురు 15 ఏళ్ల అమీలీతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. శ్రీలంక పర్యటన అనంతరం… బ్రిటన్ కు పయనమయ్యేందుకు సిద్ధమవుతూ.. కొలంబోలోని టేబుల్ వన్ కెఫేలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు.

పవిత్ర ఈస్టర్ రోజున శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ఇప్పటికి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 10 మంది దాకా ఇండియన్స్ ఉన్నారు. అయితే.. ప్రాణాలు కోల్పోయిన వారి విషాద గాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదివరకు ఓ యువతి తన కుటుంబంతో సెల్ఫీ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే బాంబు పేలుళ్లలో ఆ యువతి మృతి చెందింది. ఇలా చాలా విషాద గాథలు ఉన్నాయి.

అందులో బ్రిటన్ కు చెందిన ఓ అన్నాచెల్లెలు గాథ ఇంకోలా ఉంది. వారిద్దరూ ఒక చోట పేలుడు నుంచి తప్పించుకున్నారు కానీ.. మరో చోట బాంబు పేలుడు ధాటికి మృతి చెందారు. బ్రిటన్ కు చెందిన మాథ్యూ లిన్సే తన కొడుకు 19 ఏళ్ల డేనియల్, కూతురు 15 ఏళ్ల అమీలీతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. శ్రీలంక పర్యటన అనంతరం… బ్రిటన్ కు పయనమయ్యేందుకు సిద్ధమవుతూ.. కొలంబోలోని టేబుల్ వన్ కెఫేలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలోనే అక్కడ బాంబు పేలుడు సంభవించింది. అయితే.. ఆ బాంబు పేలుడు నుంచి వాళ్లు తప్పించుకున్నారు. ప్రాణ భయంతో హోటల్ షాంఘ్రిలాకు వెళ్లారు. వాళ్లు ఆ హోటల్ కు వెళ్లగానే అక్కడ మరో బాంబు పేలింది. ఈ ఘటనలో మాథ్యు కొడుకు డేనియల్ కూతురు అమీలీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే వాళ్లు చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version