శ్రీలంక పేలుళ్లు జరిపింది మేమే.. ఐసిస్

-

ఈ దాడిని నేషనల్ తౌహీద్ జమాత్ అనే ఉగ్రవాద సంస్థ చేయించిందని శ్రీలంక ప్రభుత్వం భావించినప్పటికీ.. ఈ దాడులు తమ పనే అని ఐసీస్ ఒప్పుకోవడంతో ఈ దాడుల వెనుక సూత్రధారి ఎవరో తెలిసిపోయింది.

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లలో జరిగిన మారణ హోమంలో 300 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. దాదాపు 500 మందికి పైగా గాయపడ్డారు.


అయితే.. ఈ మారణ హోమం సృష్టించింది తామేనని ఐసీసీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అమాఖ్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఈ ప్రకటనను రిలీజ్ చేసింది.బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారిలో దాదాపు 10 మంది దాకా ఇండియన్స్ ఉన్నట్టు సమాచారం. మరికొందరు ఇండియన్స్ కూడా ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.



అయితే.. ఈ దాడిని నేషనల్ తౌహీద్ జమాత్ అనే ఉగ్రవాద సంస్థ చేయించిందని శ్రీలంక ప్రభుత్వం భావించినప్పటికీ.. ఈ దాడులు తమ పనే అని ఐసీస్ ఒప్పుకోవడంతో ఈ దాడుల వెనుక సూత్రధారి ఎవరో తెలిసిపోయింది.

న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులకు ప్రతీకారంగానే..

న్యూజిలాండ్ మసీదుల్లో జరిగిన కాల్పుల ఘటనకు ప్రతీకారంగానే శ్రీలంకలో ఐసీస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్ విజయవర్ధనే తెలిపారు. న్యూజిలాండ్ లో జరిగిన దాడులు.. ఐసీస్ ఉగ్రవాదానికి ప్రతీకారంగానే జరిగాయి. ఓ శ్వేతజాతీయుడు క్రైస్ట్ చర్చ్ లోని మసీదుల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 50 మందికి పైగా మృతి చెందారు. ఐసీస్ ఉగ్రవాదానికి ప్రతీకారంగానే తాను ఈ దాడులు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే.. ఆ దాడుల తర్వాత.. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఐసీస్ కూడా ప్రకటించింది. అందుకోసమే… శ్రీలంక రాజధాని కొలంబోలో ఆత్మాహుతి దాడి ప్రణాళికను అమలు చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version