బట్టలిప్పితేనే నటనలో శిక్షణ ఇస్తానన్న నట కీచకుడు వినయ్ వర్మ అరెస్ట్

-

వినయ్ వర్మ దాదాపు 30 ఏళ్లుగా నటనలో శిక్షణ అందిస్తున్నాడట. అంతే కాదు.. ఆయన పలు తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటించాడు. ఆయన 20 ఏళ్ల నుంచి సూత్కధార్ అనే యాక్టింగ్ స్కూల్ ను నిర్వహిస్తున్నాడు.

మీకు గుర్తుందా? తన దగ్గర నటన నేర్చుకోవాలంటే బట్టలిప్పేయాలని, నగ్నంగా యువతులు ఉండాలని వేధించిన నట శిక్షకుడు, ప్రముఖ నటుడు వినయ్ వర్మ ఆగడాలకు తెరపడింది. నటన శిక్షణ పేరుతో యువతులపై అతడు చేస్తున్న వేధింపులకు తెర పడింది. బట్టలు విప్పలేదన్న కారణంతో ఓ యువతిని తన క్లాస్ నుంచి బయటకు పంపాడన్న వార్త కొన్ని రోజుల కింద వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ నట కీచకుడు, యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

వినయ్ వర్మ నన్ను లైంగికంగా వేధించాడు. ఏప్రిల్ 3న నేను యాక్టింగ్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యా. ఏప్రిల్ 15 వరకు యాక్టింగ్ క్లాసులు బాగానే జరిగాయి. కానీ.. ఓరోజు వినయ్ వర్మ.. గది తలుపులు, కిటీకీలు మూసి నా బట్టలు విప్పేయమని బలవంతం చేశాడు. అంతే కాదు.. నన్ను లైంగికంగా వేధించాడు.. అంటూ బాధిత యువతి తెలిపింది.

నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

బాధితురాలు ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వినయ్ వర్మను అరెస్ట్ చేశారు. ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

30 ఏళ్లుగా నటనలో శిక్షణ

వినయ్ వర్మ దాదాపు 30 ఏళ్లుగా నటనలో శిక్షణ అందిస్తున్నాడట. అంతే కాదు.. ఆయన పలు తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటించాడు. ఆయన 20 ఏళ్ల నుంచి సూత్కధార్ అనే యాక్టింగ్ స్కూల్ ను నిర్వహిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version