రోజు రోజుకు మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. వాయు వరసా అన్నీ మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక లో దారుణం చోటు చేసుకుంది. సొంత చెల్లెలు పై అన్న మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటక లోని మైసూరు గిరి దర్శిని నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…చిన్న వయసులోనే తల్లి తండ్రులు చనిపోవడం తో 16 ఏళ్ల బాలిక తన అన్న వినయ్ కుమార్ తో కలిసి జీవనం సాగిస్తోంది.
అయితే మద్యానికి బానిసైన వినయ్ కుమార్ వాయు వరసా మరిచిపోయి మృగంలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. చెల్లెలిని బెదిరించి మూడు నెలలు గా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఇక బాలికకు ఇద్దరు అన్నలు ఉండటం తో మరో అన్న ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.