ఒక భార్యకు ఒక భర్త ఉండటం అనేది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనపడుతుంది. వైవాహిక జీవితంలో మనకు తెలిసిన వరకు ఒక భర్తకు ఒక భార్యే ఉంటుంది. కాని నేపాల్ సరిహద్దుల్లో మాత్రం ఒక భార్యకు ఇద్దరు ముగ్గురు ఉంటారు. అది వివాహేతర సంబంధం కూడా కాదు. అది ఒక సాంప్రదాయం. అదేంటి అంటే… నేపాల్ సరిహద్దుల్ల్లో ఉండే గ్రామంలో అది అంతే…
అసలు ఏంటీ అంటారా చైనాకు, భారత్ కి సరిహద్దుల్లో ఉండే ఒక గ్రామంలో ఏంటీ అంటే ఒక మహిళ పెళ్లి చేసుకుంది. ఒక వ్యక్తిని వివాహం చేసుకోగా… అతని తమ్ముళ్ళను కూడా వివాహం చేసుకోవాలి. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది సోదరులను వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అది అక్కడ చట్టబద్దం మాత్రమే కాకుండా సాంప్రదాయం కూడా. ఆ గ్రామం పేరు డోలీ… ఆ గ్రామంలో….
కుటుంబ ఒక కుటుంబంలోని సోదరుల్లో పెద్ద సోదరుడు వివాహం చేసుకున్న యువతిని మిగిలిన సోదరులు కూడా వివాహం చేసుకుంటారు. ఆమెకు వారి ఆస్తి, సంపాదన మీద అన్ని హక్కులు ఉంటాయి. అలాగే లైంగిక సంబంధం కూడా అలాగే ఉంటుంది. ఒక భర్త చనిపోయినా సరే ఆమె పసుపు కుంకుమలు అలాగే ఉంటాయి. అందుకే అక్కడి తల్లి తండ్రులను కూడా పిల్లలను అలాగే ఇవ్వడానికి ఇష్టపడతారు.