సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ నుండి మాజీ మంత్రి,ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నమే అని గులాబీ శ్రేణులు, నాయకలు మండిపడుతున్నారు.
రాష్ట్ర ప్రజలు, రైతులు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన జగదీశ్ రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోలు,దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.