ఏపీ వైఎస్సార్ సీపీ దివంగత నేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అయితే, ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారు ఒక్కొక్కరుగా చనిపోతుండటంపై రాష్ట్రంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే వివేకా హత్య కేసులో అప్రూవర్ మారిన దస్తగిరికి పోలీసులు భద్రతను పెంచారు. వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాల నేపథ్యంలో తనకు భద్రత పెంచాలని దస్తగిరి కోరడంతో ఆయనకు ప్రభుత్వం సెక్యూరిటీని పెంచింది. ఇదివరకు దస్తగిరికి 1+1 గన్మెన్ లతో భద్రత కల్పిస్తుండగా.. ఇప్పుడు 2+2 గన్మెన్ లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.