తొలి ఏకాదశి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఉండనుంది. ఆషాడ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులకు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటితో పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపి పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి.
ఈ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారని అన్నారు. అదే సందర్భంలో .. త్యాగానికి గుర్తుగా హిందూ ముస్లిం లు ఐక్యంగా పీర్లపండుగ గా నేడు జరుపుకుంటున్న మొహర్రం.. తెలంగాణ గంగా జమున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడేందుకు మరింతగా కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.