KKRకు గంభీర్ ఎమోషనల్ గుడ్ బై.. వీడియో వైరల్

-

టీమ్‌ఇండియా కోచ్‌గా నియమితుడైన గౌతమ్‌ గంభీర్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మోంటార్‌ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఇప్పుడు భారత జట్టుకు కోచ్‌గా కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గుడ్ బై చెప్పాడు. కోల్‌కతా నగరంతో, కేకేఆర్‌ అభిమానులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

‘‘మీరు నవ్వితే నేను నవ్వుతాను. మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను. మీరు ఓడితే నేను ఓడిపోతాను. మీరు కల కంటే నేను కల కంటాను. మీరు సాధిస్తే నేను సాధిస్తాను. నేను మిమ్మల్ని నమ్ముతాను. కోల్‌కతా నేను మీలో ఒకడిని. మీ కష్టాలు నాకు తెలుసు. ఎక్కడ బాధ కలుగుతుందో తెలుసు. తిరస్కరణలు నన్ను బాధించాయి. కానీ, నేను మీలాగే నమ్మకంతో పైకి లేచాను. కోల్‌కతా.. మనది విడదీయలేని బంధం. మనది ఓ స్టోరీ, మనది ఓ టీమ్‌. ఇప్పుడు మనం కలిసి కొన్ని వారసత్వాలను సృష్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మేం కొన్ని పెద్ద అధ్యాయాలను లిఖించే సమయం వచ్చింది. వాటిని లిఖించేది ఊదా సిరాతో కాదు.. నీలం రంగుతో’’ అని గంభీర్‌ ఆ వీడియోలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version