పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులని కూడా పట్టించుకోలేదని అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన ఆమె పర్యటించారు ముందుగా ఎంజీఎం మహిళా సిబ్బంది అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ప్రభుత్వం గెలుపుకి కారణం అయినందుకు మీరు అందరికీ చెప్పినట్లుగానే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.
నర్సింగ్ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుని పేషంట్లకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి అన్నారు. ఎంజీఎం కి వచ్చిన ప్రతి పేషెంట్ కి మీ వంతు సేవ తప్పనిసరి అవసరం ఉంటుందని మంత్రి కొండా సురేఖ చెప్పారు కొంతమందికి నెలలు జీతం ఆగిపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులని కూడా పట్టించుకోలేదని అన్నారు.