బీఆర్ఎస్ డక్ అవుట్.. హరీష్ రావు రియాక్షన్ ఇదే..!

-

2024 పార్లమెంట్ ఎన్నికల్లో 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగిన బీఆర్ఎస్..కనీసం ఒక్క చోటు గెలవకుండా ఎన్నికల పోరులో పూర్తిగా చేతులేత్తిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది.అసెంబ్లీ ఎన్నికల్లోనైనా 38 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో ఒక్కస్థానంలో కూడా ఖాతా తెరవకుండా మూడవ స్థానంలో నిలిచింది. టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన అన్ని పార్లమెంట్ స్థానాల్లో మూడో స్థానంలోనే నిలవడం గమనార్హం.

ఈ క్రమంలో బీఆర్ఎస్ ఓటమిపై మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు.రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 24ఏళ్ల చరిత్రలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదు. లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తాం. కాంగ్రెస్, బిజెపి ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలదీస్తాం. ప్రజా తీర్పును గౌరవిస్తూ, తమని తాము సంస్కరించుకుంటూ.. భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుతాం అని ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version