బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అధికారాన్ని దుర్వినియోగం చేసిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కు నాయకుడే లేడు.. సభకు రావడమే మానేశారు. బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసి అధికార దాహానికి బలైపోయారు. కేసీఆర్ పాలనలో 8వేల హత్యలు.. గతంలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి.. ప్రతిపక్ష నేతలకు అవకాశం ఇస్తున్నాం. లేకుండా ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు ఉండేదని తెలిపారు. బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇల్లు లేని వారికి రాబోయే రోజుల్లో ఇల్లు కట్టిస్తామని తెలిపారు. నమ్ముకున్నోళ్లకు సున్నం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. పోలీస్ వ్యవస్థను దారుణంగా వాడుకున్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారినప్పుడే ఆ పార్టీ ఖతం అయిందన్నారు.