మాజీ మేయర్ భర్త బాధితుడిని.. షేక్ రసూల్ వీడియో!

-

నిజామాబాద్ మాజీ మేయర్ భర్త శేఖర్ బాధితుడిని అంటూ షేక్ రసూల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. ప్రస్తుతం అది కాస్త వైరల్ అవుతోంది. గతంలో శేఖర్‌పై షేక్ రసూల్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సైతం ఇప్పుడు వైరల్ అవుతోంది.


ఈ దాడి నేపథ్యంలో జైలుకు వెళ్లిన రసూల్ రెండు నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యాడు.ఈ క్రమంలోనే తనను పోలీసులు వేధిస్తున్నారని రసూల్ ఆరోపించారు. ఐదో టౌన్ ఎస్ఐ వ్యక్తిగతంగా తీసుకున్నారని రసూల్ ఆరోపించాడు. తరచూ వేధించే బదులు తనను ఎన్‌కౌంటర్‌ చేయాలని రసూల్ వేడుకున్నాడు. ఈ మేరకు వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version