స్విగ్గీ, జోమాటో కంపెనీ కోసం డెలివరీలు చేసే డెలివరీ బాయ్స్ కోసం ‘గిగ్’ వర్కర్స్ బోర్డు పెడుతామని ప్రకటించిన కాంగ్రస్ సర్కార్ మాట ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
గిగ్ వర్కర్స్ కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని ఆనాడు తెలంగాణకు పలుమార్లు విచ్చేసిన రాహుల్ గాంధీ ప్రకటించారని.. అప్పుడు దానికి సమ్మతించి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో దాని ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆఖరుకు గిగ్ వర్కర్లకు కూడా మోసం చేసిందని తూర్పార బట్టారు. బడ్జెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, అసలు అందులో ఏమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.