ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున తెలుగు రాష్ట్రానికి చెందిన పార్టీ ఆఫీస్ ప్రారంభం జరిగింది. తెలంగాణాలో మొదలై దేశవ్యాప్తంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలన్న పట్టుదలతో కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా తమ పార్టీ BRS పార్టీ ఆఫీస్ ను ఓపెన్ చేసి జెండాను ఎగురవేశారు. ఇక్కడకు కు చెందిన ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఇతరులు హాజరయ్యి ఆఫీస్ ఓపెనింగ్ లో పాలు పంచుకున్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఢిల్లీ లో తెలంగాణ పార్టీ జెండాను ఎగురవేయడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణం అని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.