తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా బంజారాహిల్స్ నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి హరీశ్ రావు, కవిత, మదుసూదనచారి, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు.
మరోవైపు కేటీఆర్ లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వస్తే.. ఏం చేయాలి అనే దానిపై బీఆర్ఎస్ నేతలు లీగల్ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఏసీబీ ఏం చేస్తుందనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.