రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఒంటెద్దు పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని మధుసూదానాచారి అన్నారు. అడగడుగునా కొండను తవ్వి ఎలుకను పట్టే ధోరణి కనబడుతోంది. అన్నింటా రేవంత్ విశ్వసనీయత కోల్పోయారు. అన్నింటా విఫలమయ్యారు కనుకే ప్రజల ద్రుష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారు. ఇస్తామన్న రైతు భరోసాకు అనేక షరతులు పెట్టారు. ఎకరాకు 15 వేలు అని 12 వేలే ఇస్తామంటున్నారు. రైతుల్లో ఆగ్రహం ఉందని తెలుసుకుని ప్రజల ద్రుష్టి మళ్లించడానికి ఫార్ములా వన్ కేసు తెచ్చారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. ఇపుడు కూడా అదే ధోరణిని కాంగ్రెస్ ప్రదర్శిస్తోంది. హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉండగా ktr కు ఏసీబి నోటీసులు ఎందుకు.. ప్రజల్లో ఉంటున్న కేటీఆర్ ను బద్నామ్ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం భయంకర కుట్ర చేస్తోంది. కేటీఆర్ వెంట లాయర్ ను అనుమతించకపోవడం ప్రాధమిక హక్కును హరించడమే. ఈ ప్రభుత్వానికి కోతలు కూల్చివేతలు తప్ప ఏమీ తెలియడం లేదు అని మధుసూదానాచారి పేర్కొన్నారు.