సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు.అడగగానే దుబ్బాక నియోజకవర్గానికి స్కిల్ యూనివర్సిటీ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే నష్టపోయేది మనమే అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదిలాఉండగా, ఇటీవల కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తన నియోజకవర్గానికి నిధులు, స్కిల్ యూనివర్సిటీని కేటాయించాలని కోరగా.. వెంటనే మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందుకే నేడు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించారు.