కాళేశ్వరంను పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు..? తప్పు తేలితే శిక్ష పడుతుంది అని అన్నారు. అలానే నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అన్నారు. నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకుంటుంది అని, ప్రాజెక్ట్ రిజర్వాయర్ లలో ఉన్న నీటి ని సద్వినియోగం చేసుకోవాలని BRS MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విడుదల విషయం పైన తొందరగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు.
యాసంగి పంట దిగుబడి తగ్గుతుంది అని అంటున్నారని, రైతులు పంట పండించుకునే అవకాశం ఇవ్వాలని…నీటిని విడుదల చెయ్యాలని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అనాలోచితం అని మహా రాష్ట్ర నుంచి నీటిని తీసుకు రావాలని వాళ్ళున్నారు అని అన్నారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ లలో ఉన్న నీటి ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.