ఓవర్ నైట్ లో BRS ఎమ్మెల్యేలు ట్విస్ట్..!

-

రేవంత్ రెడ్డి తో నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రదుమారాన్ని రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి మహిపాల్ రెడ్డి మాణిక్ రావు సునీత లక్ష్మారెడ్డి లో నిన్న సాయంత్రం సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అకస్మాత్తుగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా సీఎం నివాసంలో ప్రత్యక్షమవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దీని వెనక ఉన్నది ఎవరు అని సందేహం అందరిలో మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.

CM Revanth will stay away from Telangana for 10 days
CM Revanth will stay away from Telangana for 10 days

ఇదివరకు కేసీఆర్ అనుమతి లేనిదే పార్టీలోని తోటి ఎమ్మెల్యేలను పలకరించడానికి సైతం సందేహించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా మరో పార్టీకి చెందిన సీఎం దగ్గరికి వెళ్లడం తో వీరు పార్టీ మారిపోతున్నారా అన్న ప్రశ్న అందరిలో మొదలైంది. ఈ నేపథ్యంలో గంటలు వివిధ లోనే సీఎంతో భేటీ అయిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారట్లేదని మర్యాదపూర్వకంగానే సీఎంని కలిసాము అని అన్నారు. ప్రజా సమస్యలు సెక్యూరిటీ ప్రోటోకాల్ సమస్యల మీద చర్చించడానికి కలిశామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news