Breaking News : HMDA మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు

-

HMDA మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేయడం ఇప్పుడు కలకలం రేపాయి. మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగడం గమనార్హం. అమీర్ పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో కూడా ఏసీబీ తనిఖీలను చేపట్టింది. 

హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో శివ బాలకృష్ణ పని చేశారు. ఆదాయానికి మించిన కేసులు ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో శివ బాలకృష్ణ ఇళ్లు, ఆఫీస్, బంధువుల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. పదవీని అడ్డుపెట్టుకొని శివ బాలకృష్ణ వందలాది కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ ఏసీబీ దాడులకు సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఆరోపణల నేపథ్యంలో  దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news