BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్ అయ్యారు. అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను సీనియర్ నాయకులను అరెస్టు చేసి తరలిస్తున్నారు పోలీసులు. అగ్రికల్చర్ కమిషనర్ కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో ధర్నాకి దిగారు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పైన సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా కదిలేది లేదన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ నినాదాలు చేసారు. ఈ తరుణంలోనే అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను సీనియర్ నాయకులను అరెస్టు చేసి తరలిస్తున్నారు