అల్లు కనకరత్నమ్మ మృతి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నానన్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారని వెల్లడించారు.

చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దారన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్ గారికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్.
ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ఇంటిలో విషాదం నెలకొంది. నిర్మాత అల్లు అరవింద్ కు మాతృవియోగం కలిగింది. అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్న (94) మృతి చెందారు. వయోభారంతో అర్థరాత్రి 1.45 గంటలకు కన్నుమూశారు. దింతో అల్లు అరవింద్ నివాసానికి చిరంజీవి చేరుకున్నారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ ను ఓదార్చారు చిరంజీవి.