BREAKING: బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత..జడ్జి సీరియస్

-

BREAKING: బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు జడ్జి కావేరి బవేజా.

BRS MLC Kavitha withdraws default bail petition in Rouse Avenue court

వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలన్నారు జడ్జి కావేరి బవేజా. దీంతో రేపటికి కేసును వాయుదా వేస్తూ తుది విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. రేపు విచారణ జరగనున్న నేపద్యంలో ఈ రోజే కేసును ఉపసంహరించుకున్నారు కవిత న్యాయవాదులు. సీబీఐ చార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని జూలై 6న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు కవిత న్యాయవాదులు. చార్జ్ షీట్లో తప్పులేవి లేవని సిబిఐ వెల్లడించింది. ఇప్పటికే సీబీఐ చార్జ్ షీట్ ను జూలై 22న పరిగణనలోకి తీసుకున్న కోర్టు… ఆగస్టు 9న చార్జ్ షీట్ పై విచారణ జరపనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version