ఇది ఆరడుగుల బుల్లెట్టు అంటూ హరీష్ రావు ను మెచ్చుకున్న గులాబీ పార్టీ… ఈ మేరకు పోస్ట్ పెట్టింది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ వెనుక ఉన్న హరీష్ రావు అలాగే జోగినిపల్లి సంతోష్ ను ఉద్దేశించి బాంబు పేల్చారు కల్వకుంట్ల కవిత. కాలేశ్వరం కేసులో కేసీఆర్ను ఇరికించేందుకు…. హరీష్ రావు అలాగే సంతోష్ కుమార్, మెగా సంస్థ కుట్రలు పన్నిందని సంచలన ఆరోపణలు చేశారు కల్వకుంట్ల కవిత.

ఈ తరుణంలోనే కల్వకుంట్ల కవితకు గులాబీ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఆరడుగుల బుల్లెట్టు అంటూ హరీష్ రావు ను మెచ్చుకున్న గులాబీ పార్టీ…ట్వీట్ చేసింది. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ వ్యాఖ్యానించారు.
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish pic.twitter.com/RT0NtpsgJe
— BRS Party (@BRSparty) September 1, 2025