కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేసారు. హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా కవిత తీవ్ర విమర్శలు చేసారు. ఈ తరుణంలోనే హరీష్ రావుకు మద్దతు ఇచ్చారు కేటీఆర్. కల్వకుంట్ల కవితకు కౌంటర్ గా గులాబీ పార్టీ పోస్ట్ చేసిన హరీష్ రావు వీడియోను.. KTR రీట్వీట్ చేశారు. ఇది మా డైనమిక్ లీడర్ హరీష్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్… అంటూ క్యాప్షన్ ఇవ్వడం జరిగింది.

అలాగే కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రియ శిష్యుడి… గురించి ఈ కాంగ్రెస్ నేతలు అందరూ చాలా నేర్చుకున్నారని వెల్లడించారు కేటీఆర్. అయితే హరీష్ రావు పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే.. పరోక్షంగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తన సోదరి కంటే… బావకు కేటీఆర్ సపోర్ట్ గా నిలిచారని అంటున్నారు.