యడ్యూరప్ప అనే నేను.. హామీ ఇస్తున్నాను.. నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం

-

మొత్తానికి కొత్త ప్రభుత్వమైతే కొలువు తీరింది. నాలుగో సారి కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ వాజు భాయి వాలా.. యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ యడ్యూరప్పకు అభినందనలు తెలిపారు.

హమ్మయ్య.. ఎట్టకేలకు కర్ణాటక రాజకీయ సంక్షోభం ముగిసింది.. అని అనుకుంటున్నారా? ముందుంది అసలు పండుగ. యడ్యూరప్ప ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కానీ.. సభలో ఆయన మెజారిటీని చూపించుకోవాలి. అప్పుడే వాళ్ల ప్రభుత్వం నిలబడినట్టు. లేకుంటే గతంలో సంకీర్ణ ప్రభుత్వానికి ముందు హడావుడిగా యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోయారు.

మొత్తానికి కొత్త ప్రభుత్వమైతే కొలువు తీరింది. నాలుగో సారి కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ వాజు భాయి వాలా.. యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ యడ్యూరప్పకు అభినందనలు తెలిపారు.

ఇక.. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

మంగళవారం రోజున కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గలేకపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ ఊహించిందే. ఎందుకంటే.. అసెంబ్లీలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నది బీజేపీకే. 105 మంది సభ్యుల బలం బీజేపీకి ఉంది.

అయితే.. బీజేపీ అధినాయకత్వం నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు రావడం కాస్త ఆలస్యం అయ్యాయి. ఇవాళ ఉదయమే ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే యడ్డీ గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాల్సిందిగా కోరారు. గవర్నర్ ఇవాళ సాయంత్రం 6 నుంచి 6.30 మధ్యలో ప్రమాణ స్వీకారం చేయాలని సూచించడంతో.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమమైంది.

మరోవైపు.. అసమ్మతి ఎమ్మెల్యేలో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీలో సభ్యుల బలం 221 కి పడిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 112 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ.. బీజేపీకి ఉన్నది 105 మంది సభ్యులే.

ఒకవేళ మిగితా అసమ్మతి ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ అనర్హత వేటు వేస్తే… బీజేపీ ఈ గండం నుంచి గట్టెక్కినట్టే. ఈనెల 31 లోగా శాసనసభలో బలం నిరూపించుకోవాలని… గవర్నర్.. యడ్యూరప్పను కోరారు. సో… బీజేపీ తక్షణ కర్తవ్యం శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవడం. అంటే సీన్ మళ్లీ రివర్స్ అయిందన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు కలిసి బీజేపీ ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నాలు చేస్తున్నారట. చూద్దాం.. మరి యడ్డీ మెజారిటీని నిరూపించుకుంటారా? లేక కాంగ్రెస్, జేడీఎస్ లా తిప్పలు పడుతారా?

Read more RELATED
Recommended to you

Exit mobile version