ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకి దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వెళ్తున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలో ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులకు, అలాగే సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న భారత జవాన్లు కూడా ఈ కరోనా వైరస్ సోకి ఇబ్బందులకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా బీఎస్ఎఫ్ జవాన్ లను కూడా ఈ వైరస్ సోకడంతో కాస్త ఇబ్బంది పడాల్సిన విషయమే. రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న జవాన్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది.
మరోవైపు కరోనా వైరస్ సోకిన జవాన్లలలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనపడక పోవడంతో వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బిఎస్ఎఫ్ ఉన్నత స్థాయి అధికారులు తెలియజేశారు. ఇకపోతే తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం బీఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ల లో 34 మంది కరోనా బారిన పడినట్లుగా, అలాగే మరో 33 మంది ఈ వైరస్ నుంచి బయటపడినట్లు కూడా అధికారులు తెలిపారు.