చంద్రబాబు కోసం..100 మందితో సూసైడ్ బ్యాచ్‌ సిద్ధంగా ఉంది – బుద్ధ వెంకన్న

-

బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసం సూసైడ్ బ్యాచ్ సిద్దంగా ఉందన్న బుద్దా వెంకన్న…. చంద్రబాబు కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్దంగా ఉందన్నారు. చంపడానికైనా.. చావడానికైనా ఈ సూసైడ్ బ్యాచ్ సిద్దమని స్పష్టం చేశారు.

ప్రతి మనిషిలో కృతజ్ఞతనేది ఉండాలని… చంద్రబాబు నాకు, నాగుల్ మీరాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. మా చంద్రబాబు కటౌట్ కు పంచామృతాలతో పాలాభిషేకం చేశామని… 500 మందికి చీరెలు పంపిణీ చేశామని వెల్లడించారు.

చంద్రబాబు పై చెత్త వాగుడు వాగే బ్యాచ్ కి హెచ్చరించారు. వంద మందితో సూసైడ్ బ్యాచ్ ను మేము సిద్దం చేసుకున్నామని… ఈ రెండేళ్లలో చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా మేము సిద్దమని.. చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయని భావిస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version