మీడియాలో కుల కంపు తెచ్చింది మీ జగన్ రెడ్డే కదా మిత్రమా : బుద్ద వెంకన్న

-

మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత బుద్ద వెంకన్న. ‘‘ విసా రెడ్డి నువ్వు నిజంగా చదువు కున్నవా? కొన్నవా?.. నిన్నటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు నాకు ఏం సంబంధం అన్నావ్… ఇప్పుడు నిందితులకు మద్దతుగా ట్వీట్లు వేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక ఉన్నది తాడేపల్లి గ్యాంగ్ అని భయటపెట్టేశావ్.. స్పెషల్ ఫ్లైట్స్‌లో డబ్బు తరలించే అవకాశం పోయిందనే బాధ ఉండటంలో తప్పు లేదు కానీ జర్నలిస్టుల మీద పడి ఏడవటం ఎందుకు?.. మీడియాలో కుల కంపు తెచ్చింది మీ జగన్ రెడ్డే కదా మిత్రమా!, నిత్యం కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొడుతూ రోత రాతలు రాసే సా’ఛీ’ పేపర్, ఛానల్‌లో పనిచేస్తున్న వారిలో స్ట్రింగర్లతో కలిపి 2039 మంది రెడ్డి సామాజిక వర్గం వారే..

 

ఇప్పుడు చెప్పు ఎవడిది కుల పిచ్చో.. రెడ్డి కాని ఒక్క జర్నలిస్టుకైనా మీ బ్లూ మీడియాలో స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇవ్వలేదు కదా విజయసాయి రెడ్డి’’ అంటూ బుద్ద వెంకన్న ట్విట్టస్త్రాలు సంధించారు. ఇదిలా ఉంటే.. నిన్న ఎంపీ విజయ సాయిరెడ్డి చికోటి ప్రవీణ్ కుమార్‌ ఫాంహౌస్‌కు వెళ్లారు. అయితే.. అక్కడ దిగిన కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు విజయసాయిరెడ్డి. దీంతో అవి వైరల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version