చంద్రబాబు, లోకేశ్‌ లకు ప్రాణ హాని ఉంది : బుద్దా వెంకన్న

-

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లకు ప్రాణ హాని ఉందని బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్ర ఈ నెల 27న మొదలవుతుందని బుద్దా వెంకన్న చెప్పారు. లోకేశ్ తమ టార్గెట్ అని సీఎం జగన్ అన్నారని… లోకేశ్ పై దాడులు చేస్తారనే అనుమానాలు ఉన్నాయని బుద్దా వెంకన్న అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, ప్రత్యేక బలగాలతో లోకేశ్ కు భద్రత కల్పించాలని బుద్దా వెంకన్న కోరారు.

లోకేశ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు. పాదయాత్రను జీవో నెంబర్ 1తో అడ్డుకోవాలని చూస్తున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈ జీవోపై హైకోర్టు అక్షింతలు వేసినా… సుప్రీంకోర్టుకు వెళ్లారని మండిపడ్డారు బుద్దా వెంకన్న. లోకేశ్ పాదయాత్ర విజయవంతం అవుతుందనే భయం జగన్ లో ఉందని చెప్పారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version